కాంగ్రెస్ గూటికే…
ఇవాళ, రేపో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ ను వీడాలని సరిత నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సరిత దంపతులు… కాంగ్రెస్ లో చేరికపై జూపల్లితో చర్చలు జరిపారు.