<p><strong>Manipur Violence: </strong></p>
<p><br />మణిపూర్‌లో అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన హింసాత్మక ఘటనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ మహిళను నగ్నంగా రోడ్లపై తిప్పిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చాలా ఆవేశంగా మాట్లాడారు మోదీ. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించమని తేల్చి చెప్పారు. </p>