Manipur Violence ‘At Last PM Modi Spoke On Manipur After 2 Months’, Asaduddin Owaisi Taunts Modi

Manipur Violence: 

తీవ్రంగా స్పందించిన మోదీ..

మణిపూర్‌ హింసపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఉపేక్షించమని తేల్చి చెప్పారు. అయితే..దాదాపు రెండు నెలలుగా ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా ప్రధాని అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. కనీసం రెండు నెలల తరవాతైనా మాట్లాడారని సెటైర్లు వేశారు. ఆ వైరల్ వీడియో చూసిన తరవాతే ప్రధాని మోదీ చలించిపోయారా..? అంటూ ప్రశ్నించారు. ఈ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు బీజేపీ ఏ విధంగా న్యాయం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రజలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని మండి పడ్డారు. 

“మొత్తానికి రెండు నెలల తరవాత ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ అల్లర్లపై నోరు విప్పారు. ఇన్ని రోజులుగా కుకీ తెగకు చెందిన ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మహిళను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయ్యేంత వరకూ ప్రధాని ఎందుకు స్పందించలేదు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి 160 మంది మరణాలను ఎలా జస్టిఫై చేసుకుంటారు. ఎంతో మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 50 వేల మంది రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు”

– అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్ 

 

Source link