West Bengal Man Arrested Trying To Enter Bengal CM Mamata Banerjee Kolkata House Arms Contraband Recovered | మమతా ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన దుండగుడు, అరెస్ట్ చేసిన పోలీసులు

CM Mamata House: 

పోలీసుల కళ్లుగప్పి..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఆయుధాలు ఉండటం అలజడి రేపింది. నిందితుడిని షేక్ నూర్ అలమ్‌గా గుర్తించారు. పోలీసులు అప్రమత్తమై వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. రకరకాల ఏజెన్సీలకు చెందిన ID కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కాసేపటి వరకూ అక్కడ గందరగోళం నెలకొంది. నిందితుడి వద్ద ఉన్న తుపాకులు, కత్తులను సీజ్ చేశారు. ఈ విషయాన్ని కోల్‌కత్తా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. 

“షేక్ నూర్ అలమ్ అనే ఓ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. కోల్‌కత్తా పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకీ, కత్తులతో పాటు పలు ఏజెన్సీల పేరుతో ఉన్న ID కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టికర్‌ ఉన్న కార్‌లో వచ్చి ఇలా అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. స్థానిక పోలీస్ స్టేషన్‌కి విచారణ కోసం తీసుకెళ్లారు. పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడ విచారణ జరుపుతున్నారు”

– వినీత్ గోయల్,కోల్‌కత్తా పోలీస్ కమిషనర్

 

Source link