విద్యుత్ సబ్ స్టేషన్ లోనే రాసలీలలు, మహిళతో అసభ్యకరరీతిలో దొరికిన ఉద్యోగి-eluru jangareddygudem substation employee found with woman ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అసలేం జరిగింది?

జంగారెడ్డి‌గూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్‌ లో గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సబ్ స్టేషన్ కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసిన ఎవరూ తీయకపోవడంతో కొందరు బుధవారం తెల్లవారుజామున స్థానికులు సబ్ స్టేషన్‌ కు వెళ్లారు. డ్యూటీ సమయంలో మహేశ్వర్ రెడ్డి మద్యం తాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన స్థానికులు చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులేంటని అతడిని ప్రశ్నించారు. విద్యుత్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Source link