ByGanesh
Wed 29th May 2024 03:52 PM
వివి వినాయక్ కొన్నాళ్లుగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఒకప్పుడు హీరోలని స్టార్ హీరోలుగా మార్చే సినిమాలు ఇచ్చిన వినాయక్ ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. వినాయక్ ని హీరో ని చేస్తా అంటూ సినిమాని మొదలు పెట్టిన దిల్ రాజు కూడా వినాయక్ సినిమా మొదలు పెట్టి ఆపేసారు. దానితో వినాయక్ కామయ్యారు.
అయితే వినాయక్ సినిమాలేవీ చెయ్యకపోయినా.. సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒక హీరో సినిమాని ప్రమోట్ చెయ్యడానికైనా బయటికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఈమధ్య కాలంలో బయట కనిపించిన సందర్భం లేదు. కారణం ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
వినాయక్ లివర్ కి సంబందించిన ప్రోబ్లం తో ఇబ్బంది పడుతూ ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారని, తన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే ప్రెజెంట్ వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారు, ఆయనకి హెల్త్ రీజన్స్ గతంలో ఉండేవి కానీ ప్రస్తుతం అయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది.
VV Vinayak suffers from health problems:
Director VV Vinayak is at home due to health reasons