ఏపీఆర్జేసీ ఫేజ్-2 ఫలితాలు విడుదల, ఈ లింక్ లో చెక్ చేసుకోండి!-vijayawada aprjc phase 2 results released check in aprs apcfss website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

విద్యార్థులు ఏ గ్రూప్‌ల్లో ప్రవేశం

ఏపీఆర్జేసీ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశం జరుగుతుంది. ఈ ఏడాది ఏపీఆర్జేసీ-2024 ప్రవేశ పరీక్షను మొత్తం 49,308 మంది విద్యార్థులు రాశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చిలో విడుదల అయింది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రక్రియ మార్చి 1 ప్రారంభమై, ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మే 14న మొదటి ఫేజ్ ఫలితాలు విడుదల చేశారు. రెండో ఫేజ్ ఫలితాలు నేడు విడుదల అయ్యాయి.

Source link