Donald Trump Becomes First Ex US President To Be Convicted Of A Crime

Donald Trump Convicted: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అక్రమ సంబంధం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఓ నేరంలో ఇలా దోషిగా తేలిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుకెక్కారు. ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ట్రంప్‌ దోషిగా తేలడం సంచలనమైంది. hush money case కేసులో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు అన్నీ నిజమే అని కోర్టు స్పష్టం చేసింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనతో చాలా సార్లు ట్రంప్ శృంగారంలో పాల్గొన్నారనిచెప్పింది.  రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా అక్రమ సంబంధం గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులు ఇచ్చినట్టు ఆరోపించింది. చాలా రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. చివరకు న్యూయార్క్ కోర్టు ట్రంప్‌ని దోషిగా వెల్లడించింది. దాదాపు 34 ఆరోపణలు రాగా అవన్నీ నిజమే అని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే ఓ పవర్‌ఫుల్‌ లీడర్‌గా పరిగణిస్తారు. అలాంటి వ్యక్తి ఓ కేసులో ఇలా దోషిగా తేలడం అంతర్జాతీయంగా సంచలనమవుతోంది. అయితే…అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఇది అడ్డంకిగా మారే అవకాశాలు లేవు. ట్రంప్‌ జైలుకెళ్లాల్సిందేనా అన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. జులై 11వ తేదీన కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయనుంది. 

సాధారణంగా బిజినెస్‌ రికార్డ్‌లు మార్చడం అనేది అమెరికా చట్టం ప్రకారం అంత తీవ్రమైన నేరం కాదు. అందుకే గరిష్ఠంగా నాలుగేళ్ల పాటు శిక్ష వేసే అవకాశాలున్నాయి. మరో కీలక విషయం ఏంటంటే…ఆయనకు శిక్ష కచ్చితంగా వేస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే…ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇది పెద్దగా అడ్డంకి కాదన్న వాదన వినిపిస్తోంది. ఒకవేళ జైలుశిక్ష ఖరారు కాకపోతే…భారీ జరిమానా విధించే అవకాశాలున్నాయి. ట్రంప్‌ మాత్రం “నేను అమాయకుడిని” అని తేల్చి చెబుతున్నారు. ఏదేమైనా అసలైన తీర్పు ఓటర్లే ఇస్తారని స్పష్టం చేశారు. 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ రెండు రోజుల్లో 11 గంటల పాటు విచారణ చేపట్టి చివరకు ట్రంప్‌ని దోషిగా తేల్చింది. 

 

మరిన్ని చూడండి

Source link