నవంబరులో మెయిన్స్…?
ఇదిలా ఉంటే మెయిన్స్ పరీక్షలపై కూడా దృష్టి పెట్టింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. నవంబర్‌లో పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి… కొద్దిరోజుల భేటీ అయిన కమిషన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రిలిమ్స్ ఫలితాలు రాగానే… మెయిన్స్ కు కొంత సమయం ఇచ్చి నవంబరులో నిర్వహించాలని యోచిస్తోంది. 2,33,248 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన సంగతి తెలిసిందే.