ByGanesh
Thu 22nd Jun 2023 11:03 AM
మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్ తో ఏడడుగులు నడిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈమధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకుని అధికారికంగా మెగా కోడలి స్థానంలోకి రాబోతున్న లావణ్య ఇంకా ఆ ఇంటికి కోడలిగా అడుగుపెట్టకముందే తన తోడికోడలు ఉపాసనని ప్రేమతో విష్ చేసింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈమధ్యనే తల్లితండ్రులయ్యారు ఈ సందర్భంగా ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.
అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్ పిక్ లో భర్తగా మారబోయే వరుణ్ తేజ్ పిక్ ని జత చేసింది. ఫ్యామిలీ మెంబెర్స్, ఫ్రెండ్స్ తో పలు సందర్భాలలో దిగిన పిక్స్ తో పాటుగా వరుణ్ తేజ్ తో కలిసి ఓ వెకేషన్ కి వెళ్ళిన పిక్ ని అందులో పొందుపరిచింది. లావణ్య త్రిపాఠి తన ఫోన్ వాల్ పిక్ ని మై లవ్స్ డ్రీమ్ బిగ్గెర్ అంటూ ఇన్స్టాలో లో షేర్ చెయ్యగా.. అందులో వరుణ్ తేజ్ పిక్ కూడా స్పెషల్ గా ఉండడంతో మెగా ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. లావణ్య త్రిపాఠి-వరుణ్ పిక్ చూసిన మెగా ఫాన్స్ లవ్లీ జంట అని పొగిడేస్తున్నారు.
జూన్ 9న నిశ్చితార్ధం చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ పెళ్లి పీటలెక్కుతారని సమాచారం.
Varun Tej photo on Lavanya Tripathi phone wall pic:
Lavanya phone wallpaper.. Have you noticed Varun Tej pic