ఆరు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాయని స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ పరిధిలో ఉన్న 1,72,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుతో ఉద్యోగులకు లేదా వారి కుటుంబ సభ్యులకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగుల సీపీఎస్‌కు దాదాపు 20,000 కోట్లు స్టాక్ మార్కెట్‌లకు మళ్లించారన్నారు.