45 మీటర్ల ఎత్తు వస్తే మునుగుతాయని చెప్పిన గ్రామాలు 41 మీటర్ల ఎత్తుకే మునిగిపోతున్నాయని, చింతూరు మండలం కూడా పూర్తిగా ముంపునకు గురైందని అన్నారు. గత పాలకులు రూ.6.50 లక్షలు ఇస్తామంటే జగన్మోహన్‌రెడ్డి రూ10 లక్షలు ఇస్తామన్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. చింతూరు, ఎటపాక, వి.ఆర్.పురం, కూనవరం, దేవీపట్నం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రజలు ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని వదులకుని నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రోడ్డున పడ్డారని అన్నారు.