ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 గ్రూప్-4 సర్వీసులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 9.51 లక్షల మంది హాజరుకానున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండో సందర్భం. 2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేయగా, 7.9 లక్షల మంది పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున ఒక్కోపోస్టుకు 116 మంది పోటీపడనున్నారు. అయితే పేపర్ లీక్ వంటి ఘటనల నేపథ్యంలో… సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టనున్నారు. అభ్యర్థులకు కూడా కీలక సూచనలు ఇవ్వనుంది కమిషన్.