ByGanesh
Thu 22nd Jun 2023 05:39 PM
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా భోళా శంకర్. ఇటీవల భోళా మ్యూజిక్ మానియా మొదలైంది. సినిమాలో మొదటి పాట విడుదల చేయగా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకుంది. చిరంజీవి లీక్ చేసిన సంగీత్ సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి పోస్టర్ ఆడియన్స్, అభిమానుల్లో సినిమాపై హైప్ పెంచింది. ఇప్పుడు భోళా శంకర్ నుంచి మరో గిఫ్ట్ రెడీ అయ్యింది.
మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ టీజర్ జూన్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన చిరంజీవి కొత్త స్టైల్ సూపర్ వుంది. బ్లాక్ జీన్స్, బ్లాక్ టీ షర్ట్ మీద చెక్ షర్ట్ వేసిన మెగాస్టార్ సీరియస్ వాకింగ్ స్టైల్, ఆ లుక్ లో ఇంటెన్సిటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ యూట్యూబ్, ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండ్ అవ్వడమే కాదు, సినిమాపై అంచనాలు పెంచాయి. మెగాస్టార్ డ్యాన్స్, గ్రేస్ కి తగ్గట్టు మహతి స్వర సాగర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ట్యూన్ అందించారు. లిరికల్ వీడియోలో కొన్ని స్టెప్స్ చూపించినా, అవి వైరల్ అయ్యాయి. టీజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. ట్యాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు.
Bholaa Shankar Teaser On June 24th:
Megastar Bholaa Shankar Teaser On June 24th