పోలీసులమని బిల్డప్ ఇచ్చి, రీల్స్ చేస్తున్న విద్యార్థులపై దాడి- చివరికి కటకటాల పాలు-kothagudem police arrested four people duped as police beating students making reels on road ,తెలంగాణ న్యూస్

నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లొద్దు

విద్యార్థులు, మరెవరైనా రీల్స్ తీసుకోవాలన్న పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళొద్దని కొత్తగూడెం రెండో పట్టణ సీఐ రమేష్ సూచించారు. విద్యార్థులు, ఇతర వ్యక్తులు ఈ విధంగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళి ఫోటో షూట్స్, రీల్స్ లాంటివి తీసుకోవడం చేయకూడదని, ఇలాంటి సందర్భాలు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. రోడ్లపై ఏమరపాటుగా రీల్స్ తీయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. అలాగే రైల్వే ట్రాక్ లపై రీల్స్ చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు తెచ్చే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రదేశాలకు, ప్రమాదకరమైన వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లి ఫోటోలు దిగడం రీల్స్ చేయడం వంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Source link