Hindenburg Research SEBI Chairperson Madhabi Buch had stake in offshore entities used in Adani scandal

SEBI Chairperson Madhabi Buch had stake in offshore entities used in Adani scandal: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇదివరకే పలు సంచలన నివేదికలు విడుదల చేసింది. గతేడాది భారతీయ బిలియనీర్ అదానీ గ్రూప్ వ్యాపారాలను టార్గెట్ చేసింది. అదానీ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని నివేదిక అలా వచ్చిందో లేదో, ఇలా కంపెనీ షేర్లు కుప్పకూల్చాయి. అదానీ తన అతిపెద్ద ఓఎఫ్ఎస్ సక్సెల్ ఫుల్‌ అయినప్పటికీ, ఇన్వెస్టర్లకు డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేశారు. హిండెన్ బర్గ్ తాజాగా మరో సంచలన నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూపులలో సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్‌, ఆమె భర్త ధావల్ బుచ్‌ వాటాలు కలిగి ఉన్నారని తాజా రిపోర్టులో ఆరోపించింది. “సమ్ థింగ్ బిగ్ థౌన్ ఇండియా” అని ట్వీట్ చేసిన Hindenburg Research అదానీ గ్రూపులకు సంబంధించిన సీక్రెట్ మరొకటి వెల్లడించింది.

Adani money siphoning scandalకు సంబంధించిన సంస్థలలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని తాజా నివేదికలో హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నిర్వహిస్తోన్న బెర్ముడా, మారిషస్ ఫండ్స్ లో సీక్రెట్ పెట్టుబడులు ఉన్నాయని హెండెన్ బర్గ్ రిపోర్ట్ రివీల్ చేసింది. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఏ సపోర్ట్ లేకుండా అదానీ గ్రూప్ ఇంత రిస్క్ కోలేదని, అందుకు కారణం సెబీ చైర్ పర్సన్, ఆమె భర్తతో ఉన్న మనీ లింక్స్ కారణమని గుర్తించాం. మాధవిపురి బుచ్‌, ఆమె భర్త ధవల్ బుచ్ జూన్ 5, 2015న సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్ 1తో తొలిసారి తమ ఖాతాను తెరిచారు. IIFLలోని ప్రిన్సిపాల్ సంతకం ప్రకారం.. సెబీ చైర్మన్ దంపతుల నికర విలువ $10 మిలియన్లుగా అంచనా. ఈ ఫండ్ బెర్ముడాలోని గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ (GDOF)లోని ఓ స్ట్రక్చర్‌లో భాగం. కాగా, మాధవిపురి బుచ్ దంపతుల వాటా విలువ ఫిబ్రవరి 2018 నాటికి 872,762.25 అమెరికా డాలర్లు’ అని ఆరోపించారు.

గతంలో హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం అదానీ కంపెనీ రూ. 20,000 కోట్ల ఐపీఓ పబ్లిక్ ఆఫర్ రద్దు చేసి, ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగిచ్చేసింది. కానీ ఆ నివేదికలో నిజాలు లేవని కంపెనీ ఆ వార్తల్ని ఖండించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల్ని ఎలా నమ్మాలని ప్రశ్నలు సైతం లేవనెత్తారు. అయితే సెబీ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూపు ఏ తప్పిదం చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. 

మరిన్ని చూడండి

Source link