AP Police: శభాష్‌ పోలీస్…కుంభవృష్టిలో కూడా జడవని పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది.. విపత్తుకు ఎదురు నిలిచి సేవలు

AP Police: విజయవాడ చరిత్రలో మునుపెన్నడూ చూడని విపత్తు ఎదురైనా పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది ఎదురొడ్డి నిలిచారు.రాత్రికి రాత్రి కురిసిన కుంభవృష్టితో నగరంలో రోడ్లన్ని జలమయం అయ్యాయి.రహదారులు ఏరులయ్యాయి. జనం నిద్ర లేచే సరికి నగరంలో రోడ్లన్ని నదులయ్యాయి. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లు వాన నీటితో నిండిపోయాయి.

Source link