Ten ways my life has changed since coming to India says US Woman

US Woman on INDIA: ‘ఇండియా ఈజ్‌ నాట్ ఫర్ బిగినర్స్‌’.. అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ మనం చూస్తుంటాం. ఒక్కసారి అలవాటు పడితే భారత్‌లో బతకడం చాలా గొప్పగా ఉంటుందని అమెరికన్ మహిళ క్రిస్టెన్‌ ఫిషర్ అంటున్నారు. కంటెంట్‌ క్రియెటర్‌గా ఉన్న ఫిషర్‌.. భారత్‌కు వచ్చిన తర్వాత.. తన జీవితంలో పది విషయాలు గొప్పగా తన జీవితాన్ని ప్రభావితం చేశాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. దీనికి ఇప్పటికే 20 లక్షలకు పైగా వీవ్స్ వచ్చాయి. ఫిషర్‌ను అంతగా ప్రభావితం చేసిన ఆ 10 విషయాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం.

భారత్‌లో ఫిషర్‌కు నచ్చిన 10 అంశాలు:

            భారత్‌కు వచ్చిన మొదట్లో తాను అనేక విషయాల్లో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందని క్రిస్టెన్ ఫిషర్ తెలిపారు. అయితే ఆ అడ్జస్ట్‌మెంట్‌లే తన జీవితంలో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చాయని ఫిషర్ అంటున్నారు. భారత్‌లో జీవించడాన్ని ఇష్టపడుతున్నట్లు చెప్పారు.


  1. శాఖాహారిగా మారాను: భారత్‌లో అన్నింటికన్నా గొప్ప విషయం శాఖాహారిగా ఉండడం. భారత దేశంలో ఆహారపు అలవాట్లు చాలా మంచివి. అందునా వెజిటేరియన్‌గా ఉండడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. జంతువులను చంపి తినే క్రూయెల్టీ నుండి బయట పడడమే కాక.. శాఖాహారిగా మారితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు ఫిషర్‌. ఇప్పుడు అవన్నీ శాఖాహారిగా మారిన తనకు అందుతున్నాయని తెలిపారు.
  2. భారతీయ దుస్తులు: భారతీయులు ధరించే దుస్తుల గురించి కూడా ఫిషర్‌ గొప్పగా చెప్పారు. ఇక్కడి బట్టలు అన్ని కాటన్‌తో తయారు చేసినవని.. ఈ వాతావరణానికి గొప్పగా నప్పుతాయని.. బట్టల ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని ఫిషర్ అన్నారు. తాను కూడా కుర్తాలను ప్రతి రోజూ ధరిస్తున్నట్లు తెలిపారు.

౩. ప్రజారవాణాను వినియోగించడం: అమెరికాలో మాదిరి కాకుండా భారత్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు గొప్పగా ఉంటుందని.. ఫిషర్ తెలిపారు. అమెరికాలో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత కారు ఉండడం తప్పనిసరన్న క్రిస్టెన్‌.. ఢిల్లీలో మాత్రం ప్రపంచంలోనే బెస్ట్ ప్రజా రవాణా వ్యవస్థ ఉందని చెప్పారు. తాను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను యూజ్ చేస్తున్నట్లు వివరించారు.

  1. భారతీయుల దినచర్యలో “టీ”: భారతీయుల దినచర్యలో టీ పాత్ర చాలా గొప్పదని ఫిషర్ పేర్కొన్నారు. భారత్‌కు వచ్చాక ఈ అలవాటును ఒక దినచర్యగా మార్చుకోవడానికి తనకు ఎంతో సమయం పట్టలేదని.. ప్రతి రోజూ తాను కూడా ఛాయ్ తాగుతున్నట్లు తెలిపారు. ఇంకా చెప్పాలంటే టీ తన జీవితంలో ఒక భాగం అయిందన్నారు. దీనిని పరిచయం చేసిన భారత్‌కు థ్యాంక్స్ చెప్పారు.
  2. ప్రైవేటు స్కూళ్లలో చదువులు: మనం మాత్రం భారత్‌లో ప్రైవేటు విద్య గురించి నానా అపోహలతో తిట్టి పోస్తుంటాం. ఫిషర్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. భారత్‌లో తన పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించగలుగుతున్నానంటూ గొప్పగా చెప్పారు. అమెరికాలో ఐతే.. ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపడం అంటే తలకు మించిన భారమని.. భారీగా ఖర్చు అవుతుందని.. భారత్‌లో మాత్రం తక్కువ ఖర్చులోనే అంతే క్వాలిటీ విద్య లభించడం గొప్ప విషయంగా క్రిస్టెన్ చెప్పారు.
  3. భారత్‌లో చేతులతో భోజనం చేయడం గొప్ప విషయంగా ఫిషర్ అన్నారు. తాను భారత్‌కు వచ్చిన తర్వాత ఈ మంచి అలవాటును అలవరచుకున్నానని అన్నారు. తొలుత ఇది సరైన పద్ధతి కాదని అనిపించినా.. అలవైటన తర్వాతా ఈ విధానంలో తినడం ద్వారా ఆ ఫుడ్‌ రుచిని పూర్తిగా ఆస్వాదించగలుగుతున్నట్లు ఫిషర్‌ చెప్పారు.
  4. భారత్‌కు వచ్చిన తర్వాత హిందీ నేర్చుకోగలిగానని.. కొద్ది కొద్దిగా తాను కూడా హిందీలో మాట్లాడుతున్నానని చెప్పారు. హిందీ ఫ్లూయెంట్‌గా రాకుండా ఢిల్లీలో బతకడం కాస్త కష్టం అని ఇప్పుడు తాను రెగ్యులగ్‌గా మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. హిందీ చదవడం రాయడం తనకు వచ్చని చెప్పడానికి గర్విస్తానని అన్నారు.
  5. అమెరికాలో ఇంట్లో ప్రతి పనికి మెషిన్స్ ఉంటాయని.. అంట్లు తోమాలన్నా.. ఇల్లు ఊడ్చాలన్నా మెషిన్స్‌పై ఆధారపడతామని.. భారత్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఉండే పరిస్థితులు తనకు నచ్చాయని.. తాను కూడ ఈ విధానానికి అలవాటు పడ్డానని చెప్పారు.
  6. భారత్‌లో ఆహారపు అలవాట్లు గొప్పగా ఉంటాయని అంటున్నారు. అమెరికాలో అంతా క్విగ్‌గా చేసుకోవడమే . కానీ భారత్‌లో అలా కాదు. భోజనం అంటే ఎన్నో విషయాలు ఉంటాయి. మరెన్నో పోషకాలు అందించే ఫుడ్స్‌ వారి ఆహారపు అలవాట్లలో భాగంగా ఉంటాయి. ఎప్పుడూ ఫ్రెష్ ఫుడ్‌నే తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఫిషర్ చెప్పారు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రీమేడ్‌ లేదా ఫ్రోజన్ ఐటెమ్స్ కొనాల్సి వచ్చేదని.. భారత్‌కు వచ్చాక ఆ సమస్య తీరిందని అన్నారు.
  7. మొదట్లో టాయిలెట్లలో టాయిలెట్‌ స్ప్రేయర్ వాడడానికి చాలా ఇబ్బంది పడేదానిని అన్నారు ఫిషర్‌. అయితే ఇప్పుడు భారతీయ విధానాలకు అలవాటు పడ్డానని.. ఇక తిరిగి అమెరికా పద్దతుల్లోకి వెళ్లేది లేదని.. భారతీయుల టాయిలెట్ వ్యవస్థ విధానం చాలా మంచిది ఆరోగ్యకరమైనదని చెప్పారు.

      భారత్‌లో అమెరికన్‌ మహిళ నచ్చిన 10 అంశాలకు ఇన్‌స్టాలో భారీ వీవ్స్ వస్తున్నాయి. భారత్‌ పట్ల ఆమె చూపిన ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు.

Also Read: Work Life Balance Tips : ఉద్యోగుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి.. తగ్గించుకునేందుకు ఆ విషయాలకు నో చెప్పండి.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మరిన్ని చూడండి

Source link