రజినీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో డాక్టర్స్


Tue 01st Oct 2024 01:54 PM

rajinikanth  రజినీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో డాక్టర్స్


Treatment procedure completed for hospitalised Superstar రజినీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో డాక్టర్స్

నిన్న సోమవారం అర్ధరాత్రి సమయంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరడం ఆయన అభిమానులను ఆందోళన కలిగించింది. అర్ధరాత్రి అస్వస్థతకు గురైన రజినీకాంత్ ను ఫ్యామిలీ మెంబెర్స్ చెన్నై అపోలో ఆస్పత్రిలో జాయిన్ చెయ్యగా రజినీకాంత్‌కు అపోలో డాక్టర్స్ కార్డియాలజి పరీక్షలు నిర్వహించారు. 

అయితే సూపర్ స్టార్ కు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్యులు ఆయన పొత్తి కడుపులో స్టెంట్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు రజినీకాంత్ వైఫ్ లత కూడా రజినీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు, రికవరీ అవుతున్నట్లుగా చెప్పారు. 

ఓ మూడు రోజుల తర్వాత సూపర్ స్టార్ అపోలో నుంచి డిశ్చార్జ్ అవుతారని సమాచారం. ప్రస్తుతం రజిని అభిమానులెవారూ ఆందోళన పడవద్దని, ఆయన త్వరలోనే రికవరీ అయ్యి మళ్ళీ తన సినిమా సెట్స్ లకి వెళ్ళిపోతారని తెలియడంతో రజిని అభిమానులు రిలాక్స్ అవుతున్నారు. 

 


Treatment procedure completed for hospitalised Superstar:

Rajinikanth Health Update





Source link