శ్రీచైతన్య కాలేజీ, హాస్టల్ లో తనిఖీలు
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద….శ్రీచైతన్య కాలేజీ హాస్టల్, మెస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అపరిశుభ్రత ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని యాజమాన్యంపై నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. విద్యార్థినులకు ఏమైనా సమస్యలున్నా, యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ భరోసా ఇచ్చారు. గతవారం నిర్మల్ జిల్లా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కాలేజీల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.