విడాకులు కావాలి కానీ కోర్టుకు హాజరవ్వరు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో 18 ఏళ్ళ సంసార జీవితానికి విడాకులతో ఎండ్ కార్డు వేసారు. రెండేళ్ల క్రితమే ధనుష్-ఐశ్వర్యలు విడిపోతున్నట్టుగా ప్రకటించారు. 2004 లో వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు 18 సంవత్సరాల తర్వాత అంటే 2022 లో పరస్పర విభేదాల వలన విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. 

అయితే ధనుష్-ఐశ్వర్య లు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల క్రితమే విడాకుల పిటిషన్ వేసిన ఈ జంట ఇప్పటివరకు విచారణ కోసం కోర్టుకు హాజరవలేదు. ఈ నెల అంటే అక్టోబర్ 7 కి వాయిదా ఉన్నప్పటికీ ధనుష్ కానీ ఐశ్వర్య కానీ విడాకుల కోసం విచారణకు ఈ నెల 7 న కోర్టుకు హాజరవలేదు.  

దానితో విచారణను చెన్నై ఫ్యామిలీ కోర్ట్ ఈనెల 19 కి వాయిదా వేసింది. మరి విడాకులు తీసుకుని విడిపోతున్నట్టుగా ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య లు ఆ విడాకుల కోసం కోర్టుకు ఎందుకు హాజరవడం లేదు ఎందుకో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Source link