Jayasudha Joins BJP : ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో జయసుధ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి మోదీ అభివృద్ధిని చూసి బీజేపీలో చేరానని జయసుధ తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతలతో ఏడాదిగా సంప్రదింపులు జరిపి, మొత్తానికి నేడు బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. క్రైస్తవుల ప్రతినిధిగా తన వర్గం గళం వినిపిస్తానని జయసుధ అన్నారు. జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్.. ఇటీవల జయసుధతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన ఆమె…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకిషన్ రెడ్డితో భేటీ అయి చర్చించి ఇవాళ బీజేపీలో చేరారు.