Genuine Cases Of Sexual Offences Are Now Exception; Law Is Biased Against Men: Allahabad High Court

Allahabad High Court: లైంగిక నేరాలకు సంబంధించిన కేసులపై అలహాబాద్ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులలో చట్టం సహాయంతో బాలికలు/మహిళలు పైచేయి సాధించేందుకు అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. మగవారితో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగించినప్పటికీ, చివరికి తాము మోసపోయాం అని అత్యాచార ఆరోపణలతో కేసులు నమోదుచేసి కొందరు ప్రయోజనం పొందుతున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. మగవారికి చాలా సందర్భాలలో అన్యాయం జరుగుతుందని.. కనుక కొన్ని కేసులలో వాస్తవాలు గ్రహించి నిందితుడికి బెయిల్ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. 

చట్టం పురుషుల పట్ల విపరీతమైన పక్షపాతధోరణి కలిగి ఉందని.. కనుక ఇలాంటి లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణల కేసుల విషయాలలో బెయిల్ పిటిషన్‌ విచారించే సమయంలో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని సింగిల్ జడ్జి జస్టిస్ సిద్ధార్థ్ అన్నారు. ఎందుకంటే మహిళలపై లైంగిక వేధింపులు లాంటి చట్టాలలలో పురుషులకు కొన్ని అంశాలు వ్యతిరేకంగా మారుతున్నాయని, వారిపై చాలా తేలికగా అత్యాచార ఆరోణలతో ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. 

సోషల్ మీడియా, సినిమాలు, టీవీ షోల ప్రభావంతో స్వేచ్ఛగా బతకడం లాంటి జీవనశైలికి యువతీయువకులు అలవాటు పడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో వారు సహజీవనం చేసి లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే తమకు ఇబ్బంది అని భావిస్తారో అప్పుడు పోలీసులను ఆశ్రయించి లైంగిక వేధింపుల కేసులు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తి చెప్పారు. సహజీవనం అంటూ ఇద్దరు కలిసి శారీరక సంబంధం పెట్టుకుని చివరికి పురుషులు కేసుల్లో ఇరుక్కున్న ఘటనలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. కేసు విచారణలో పోక్సో చట్టం, ఇతర భారతీయ చట్టాలతో అత్యాచార కేసులు నమోదు కాగా, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే చట్టాల కారణంగా మహిళలు పైచేయి సాధిస్తున్నారు.  

నిందితుడు మైనర్ బాలికతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నాడని ప్రభుత్వ న్యాయవాది ఆరోపించారు. కానీ నిందితుడు తన బంధువుతో కూడా శారీరక సంబంధం పెట్టుకోవాలని బాలికపై తీసుకురాగా, వ్యతిరేకించిందన్నారు. దాంతో ఇద్దరు కలిసి ఆమెపై దాడి చేయడంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిందన్నారు.

నిందితుడి తరఫు న్యాయవాది ఏమన్నారంటే.. బాధితురాలు అని చెబుతున్న ఆమె మేజర్ అని, ఆమె ఇంటి నుంచి తన అత్త ఇంటికి వెళ్లి అక్కడ తన క్లయింట్ తో శారీరక సంబంధం పెట్టుకుందని చెప్పారు. ఆపై వీరిద్దరూ వివాహం చేసుకోగా, ఆమె తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లడంతో వివాదం మొదలైంది. బాధితులు ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసు నమోదు చేశారని, తమ పెళ్లి కూడా అధికారికంగా రిజిస్టర్ చేసినట్లు బాధితుడు తెలిపారు. ఒకవేళ విడిపోవాలంటే కోర్టు నుంచి వారు విడాకులు తీసుకోలేదు. 

కానీ ఎఫ్ఐఆర్ ను అవకాశంగా తీసుకుని పలు సందర్భాలలో తమకు తమపై దారుణం జరిగిందంటూ ఆడవారు లైంగిక దాడుల కేసులు పెడుతున్నారని అలహాబాద్ హైకోర్టు గుర్తించింది. ఈ కేసులో లక్ష్మణ్ త్రిపాఠి ప్రభుత్వం తరపున వాదించగా, నిందితుడి తరపున ఓం నారాయణ్ పాండే వాదనలు వినిపించారు. చివరికి నిందితుడికి బెయిల్ దరఖాస్తుకు అనుమతి ఇచ్చారు.

Source link