Fraud Employees: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం సచివాలయ ఉద్యోగులు అడ్డదారులు తొక్కారు. నకిలీ ధ్రవపత్రాలను తయారు చేసి వాటితో పథకాలు పొందుతున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ను అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టి, మోసాలు ధృవీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.