ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డేవిల్స్ లాంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు కరణ్ నాయర్. ఐపీఎల్‌లోనూ పెద్దగా రాణించలేకపోవడంతో రెండేళ్లుగా అతడిని ఏ ఫ్రాంచైజ్ కొనలేదు. 2023 సీజన్లో కేఎల్ రాహుల్ గాయపడటంతో అతడి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కరణ్ నాయర్‌కు ఎంపికచేసినా ఆడే అవకాశం మాత్రం దక్కలేదు.