US Ambassador to India Eric Garcetti Tauba Tauba Diwali party dance goes viral | Eric Garcetti: తౌబా తౌబా డాన్సలు – దీపాల వెలుగులు

US Ambassador to India Eric Garcetti  Diwali party dance:   భారత్‌లో అమెరికా రాయబారి అంటే చాలా పెద్ద పొజిషనే. ఆయన దీపావళి పండుగ కోసం చేసిన హంగామా  ఇంతా ఇంతా కాదు. ఏకంగా ఎత్నిక్ వేర్ లో డాన్సులు చేసేశారు. తౌబా తౌబా అంటూ ఆయన చేసిన డాన్సులకు సోషల్ మీడియా బద్దలైపోయింది. అమెరికా రాయబరి డాన్స్‌కు ఫిదా కానివారు లేరు. 



హిందూ పండుగలంటే అమితమైన ఆసక్తి చూపించే అమెరికా రాయబారి దీపాలను షేర్ చేస్తూ ఉదయమే ఓ వీడియో షేర్ చేశారు. అది ఆయనకు దీపావళి పండుగపై ఉన్న  ఆసక్తిని తెలియచేస్తుంది. 



దీపావళి పండుగను అమెరికాలోని వైట్ హౌస్ లోనూ ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు కూడా.                                                              



చాలా మంది రాయబారులు దేశంలోని ప్రధానమైన హిందూ పండుగల్లో పాల్గొంటారు కానీ ఎరిక్ గార్సెట్టీ మాత్రం ప్రత్యేకం. ఆయన లీనమైపోతారు.  భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో కలిసిపోవాలనుకుంటారు. ఆయన చేసిన డాన్సే దానికి సాక్ష్ష్యం. సాధారణంగా  అమెరికా నుంచి రాయబారులుగా వచ్చిన వారు కాస్త టెక్కు చూపిస్తారు.  కానీ గార్సెట్టీ మత్రం ఇండియన్స్ తో కలిసిపోతున్నారు.          

మరిన్ని చూడండి

Source link