Elon Musk is hiring Hindi tutors for his AI firm check job role and other details | Elon Musk: హిందీ ట్యూటర్లకు ఎలాన్ మస్క్ కంపెనీలో ఉద్యోగావకాశాలు

Elon Musk is hiring Hindi tutors for his AI firm: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌కు చాలా కంపెనీలు ఉన్నాయి. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఆయన కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  రంగంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో xAI అనే కంపెనీని స్థాపించారు. ఇప్పుడీ కంపెనీ రూపొందించే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రొడక్ట్స్ ను స్థానిక భాషల్లోనూ ఏఐ వినియోగం పెంచాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో అత్యధికంగా  మాట్లాడే వారితో ఏఐ టూల్స్ కు మెరుగులు దిద్దాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ట్యూటర్లను  నియమించుకోవాలని నిర్ణయించారు.                                     

రెండేళ్లలోనే 83 వేల కోట్ల రేంజ్‌కి చేరిన అల్కేమీ – ఇది మన నిఖిల్ విశ్వనాథన్‌దే! పెళ్లి కూడా కానీ ఈ కుర్రాడు ఎలా సాధించాడంటే ?

ఈ మేరకు జాబ్ పోర్టల్స్‌లో xAI తరపున ప్రకటనలు వచ్చాయి. ఇందులో జాబ్ రోల్స్ గురించి ప్రకటించారు. ఇంగ్లిష్ తో పాటు హిందీ, మాండరీన్ సహా ఇతర దేశాల్లో ప్రముఖంగా మాట్లాడే భాషలకు చెందిన వారిని ఇంటర్యూలకు పిలిచారు. ఇది పార్ట్ టైమ్ జాబే కానీ సిగ్నిఫిషియంట్ అంటూ చెప్పుకొచ్చారు. అంటే గంటకు ఇంత అని చెల్లిస్తారు. ప్రకటనను బట్ట గంటకు రెండున్నర వేల నుంచి ఐదు వేల రూపాయల వరకూ లభించే అవకాశం ఉంది. ఎన్ని గంటలు పనిచేస్తే ఆ లెక్కన ఇస్తారు. 

అర్హులైన అభ్యర్థులకు టెక్నికల్ రైటింగ్ తెలిసి ఉండాలి. జర్నలిస్టులుగా పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. మంచి  కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఏఐ లింగ్విస్టిక్ ఎబిలిటీని  మరింత పెంచేలా ఉండాలి. ఏ భాషలో అయినా  xAIని సమర్థంగా వాడుకునేలా రూపొందించడంలో వీరంతా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఎంపికైనా వారిని ఆరు నెలల కాలానికి హైర్  చేసుకుంటారు. గంటల లెక్కన చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా అవసరం అనుకుంటే కొనసాగిస్తారు.  అనుభవాన్ని బట్టి  గంటకు ఎంత అనేది డిసైడ్ చేస్తారు. మెడికల్ బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు. 

లక్నోలో అడుక్కునేవాళ్ల సంపాదన ఒక్కొక్కరికి లక్ష పైనే – ఐ ఫోన్లూ వాడతారు తెలుసా!

ఉద్యోగ ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లాంగ్వేజ్‌లో ఉన్న  నైపుణ్యాన్ని  పలురకాలుగా ఎసెస్ మెంట్ చేస్తారు. ఈ జాబ్ రోల్ ను జాబ్ సైట్స్ లో ప్రకటించిన తర్‌వాత వైరల్ అయింది. ఇంగ్లిష్ తో పాటు హిందీ వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.  ఎలాన్ మస్క్ సాధారణంగా వర్క్ ఫ్రం హోం విధానానికి వ్యతిరేకం. అందుకే అమెరికాలో ఉండే వారికే ఈ పార్ట్ టైం జాబ్ రోల్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.            

ఆసక్తి ఉన్న వాళ్లు  xAI వెబ్ సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. 

Job Application for AI Tutor – Bilingual (Full-Time) at xAI

మరిన్ని చూడండి

Source link