మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు వరి ధాన్యం ఆరబెట్టారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడంతో…వాహనాల రాకపోకలు రోడ్డుకు ఒకవైపు నుంచే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తు్న్న మన్నె ఆంజనేయులు(50), ఆయన మరదలు లావణ్య(35), ఆమె ఇద్దరు పిల్లలకు సహస్ర(10), శాన్వి(6) తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతులు పోతారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.