If Sai Pallavi does OK, the movie will be a hit సాయి పల్లవి సైన్ చేస్తే హిట్ పక్కా


Sun 03rd Nov 2024 01:03 PM

sai pallavi  సాయి పల్లవి సైన్ చేస్తే హిట్ పక్కా


If Sai Pallavi does OK, the movie will be a hit సాయి పల్లవి సైన్ చేస్తే హిట్ పక్కా

లేడీ పవర్ స్టార్ మాదిరి సాయి పల్లవి క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది. ఆమె స్టార్ హీరోలతో సినిమాలకు సైన్ చెయ్యకపోయినా.. ఆమె సైన్ చేసే సినిమాలు మాత్రం సక్సెస్ తీరానికి చేరడమే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆచి తూచి సినిమాలు సెలెక్ట్ చేసుకునే సాయి పల్లవి రీసెంట్ గా కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన అమరన్ మూవీలో నటించింది.

విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలున్న అమరన్ సినిమా విడుదలయ్యాక భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. అమరన్ చిత్రం వీక్షించిన క్రిటిక్స్, ప్రేక్షకులు యునానమస్ గా హిట్ టాక్ ఇవ్వడంతో అమరన్ కలెక్షన్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి.

సాయి పల్లవి మరోసారి తన నటనతో అందరి మనసులను గెలుచుకుంది. ఈ చిత్రం ఓటీటీలోనే ఆడుతుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అందుకే థియేటర్స్ లో రెవిన్యూ ఉండదని చాలామంది అనుకున్నా.. అందరి ఊహలను అమరన్ కలెక్షన్స్ తారుమారు చేసేశాయి. అమరన్ కలెక్షన్స్ రోజుకొక కొత్త నెంబర్లు నోట్ చేస్తుంది. మూడు రోజులకే దాదాపుగా 100 కోట్లు కొల్లగొట్టేసింది.

ఇక సాయి పల్లవి సైన్ చేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బాగా మొదలైంది. మరోపక్క సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య తో కలిసి చేస్తున్న తండేల్ విడుదలకు రెడీ అవుతుంది. సో ఇది కూడా హిట్ పక్కా అంటూ అక్కినేని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. 


If Sai Pallavi does OK, the movie will be a hit:

Amaran breaks Rs. 100 crore barrier





Source link