Venkatesh Playing With NTR Sons ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ ఆటలు


Mon 04th Nov 2024 11:52 AM

venkatesh  ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ ఆటలు


Venkatesh Playing With NTR Sons ఎన్టీఆర్ కొడుకులతో వెంకీ మామ ఆటలు

నిన్న ఆదివారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో ఎన్టీఆర్ అలాగే ఆయన వైఫ్ ప్రణతి, కొడుకులు అభయ్, భార్గవ్ లు పేస్టల్ కలర్ కాస్ట్యూమ్స్ తో మెరిసిపోగా.. తారక్ చిన్న కొడుకు ఈ ఫంక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. 

ఇక ఈ వేడుకలో వెంకటేష్ ఆయన వైఫ్ నీరజ, అలాగే నిర్మాత నాగ వంశీ ఫ్యామిలీ, చినబాబు ఫ్యామిలీ పాల్గొన్నారు. కళ్యాణ్ రామ్ తన భార్య స్వాతి తో సహా నిశ్చితార్ధ వేడుక లో పాల్గొని నార్నె నితిన్, ఆయనకు కాబోయే భార్యను ఆశీర్వదించారు. ఈ ఫంక్షన్ లో వెంకటేష్ తారక్ కొడుకులతో ఆడుకున్న వీడియోస్ వైరల్ అయ్యాయి. 

వెంకటేష్ ఎన్టీఆర్ చిన్న కొడుకును ముద్దు చెయ్యడమే కాదు, పెద్ద కొడుకు తో కలిసి సరదాగా గడిపిన వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


Venkatesh Playing With NTR Sons:

Venkatesh Playing With NTR Sons at Narne Nithin engagement 





Source link