ByGanesh
Mon 04th Nov 2024 03:28 PM
నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 4 న పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారనే వార్త అనధికారమే అయినప్పటికి.. ఈ న్యూస్ మాత్రం ట్రెండింగ్ లో నడుస్తుంది. ఆగష్టు 8 న నిశ్సితార్ధం చేసుకున్న చైతు-శోభిత దూళిపాళ్ల పెళ్లి డేట్ అఫీషియల్ గా బయటకి రాలేదు. మరోపక్క శోభిత ఇంట పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలు పెట్టారు శోభిత కుటుంబ సభ్యులు.
అయితే నాగ చైతన్య-శోభిత ల వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ కోట వేదిక కానుంది, నాగార్జున కొడుకు వివాహాన్ని రాజస్థాన్ లో చెయ్యాలని అనుకున్నట్లుగా వార్తలొచ్చినా తాజా సమాచారం ప్రకారం నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్య వివాహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గ్రాండ్ గా నిర్వహించేలా ఏర్పాట్లు మొదలు పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
అన్నపూర్ణ స్టూడియో లోనే నాగ చైతన్య-శోభితల పెళ్లి చేసేందుకు నాగార్జున ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కి పనులు అప్పజెప్పారని.. అన్నపూర్ణ స్టూడియో లో వెయ్యబోయే స్పెషల్ సెట్ లో చైతు-శోభితల వివాహాన్ని చేయతలపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈవేడుకకు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
Is Chaitu-Sobhita wedding venue fixed.. :
Naga Chaitanya, Sobhita Dhulipala wedding venue fixed..