IDBI Recruitment of Executive Posts Notification: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 7 నుంచి 16 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1050 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు రూ.29,000, రెండో సంవత్సరం రూ.31,000 జీతంగా చెల్లిస్తారు.
వివరాలు..
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1000.
పోస్టుల కేటాయింపు: యూఆర్- 451, ఓబీసీ-231, ఈడబ్ల్యూఎస్-100, ఎస్సీ-127, ఎస్టీ-94.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.10.1999 – 01.10.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు, 1984 అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉండాలి. ఇందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్- 60 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వే్జ్- 40 ప్రశ్నలు-40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్/ఐటీ నుంచి – 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కాగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పులకు 1 మార్కు కోత ఉంటుంది.
జీత భత్యాలు: ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.29,000, రెండో ఏడాది రూ.31,000 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 07.11.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 16.11.2024.
➥ దరఖాస్తుల సవరణ తేదీ: 16.11.2024.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 01.12.2024.
ALSO READ: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా మొత్తం 1500 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480-రూ.85,920 జీతంగా చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని చూడండి