Saudi Arabian desert covered in snow | Snow In Desert: మంచుకొండలుగా సౌదీ ఎడారులు

Saudi Arabian desert covered in snow: బ్రహ్మం గారి కాలజ్ఞానం విన్నవారికి అప్పుడప్పుడూ వెలుగుచూసే చిత్రవిచిత్రాలు చూసి అప్పుడే చెప్పెను బ్రహ్మం గారూ అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్క మన రాష్ట్రం.. మన దేశంలో మాత్రమే కాదు… ప్రపంచవ్యాప్తంగా అలాంటి వింతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పుల విషయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. 

గల్ఫ్ దేశాలను మనం ఎడారి దేశాలని పిలుస్తాం. అంతా ఎడారే ఉంటుంది. ఇసుకతో నిండి ఉంటుంది. ఎండలు పేట్రేగిపోతాయి. కానీ వర్షం మాత్రం జాడ కనిపించదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. ఇటీవల పలుమార్లు ఎడారుల్లో వచ్చిన వర్షాల దాటికి వాహనాలు కూడా కొట్టుకుపోయాయన్న వార్తలు వచ్చాయి. అందరూ ఇదేం విచిత్రం అనుకున్నారు. అలాంటి వర్షం వస్తే ఎడారుల్లో ఇంత కాలం ఉన్న వారికి కాస్త రిలీఫే. ఇప్పుడు అక్కడ ఉండేవారికి మరో విచిత్రమైన వాతావరణ మార్పు కూడా కనిపిస్తోంది. అదేమిటంటే మంచు కురవడం.       

గెలిచింది ట్రంప్ – గెలిపించింది మస్క్ -అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్

సౌదీ అరేబియా ఎడారుల్లో ఎప్పుడూ మంచు జాడే ఉండదు. మంచు కురిస్తే అసలు అది ఎడారే కాదు. కానీ ఈ సారి మాత్రం మంచు కురుస్తోంది. అది కూడా అలా ఇలా కాదు. మన కశ్మీర్‌లో మంచు కురిసి రోడ్లు ఎలా బ్లాక్ అవుతాయో అంత భారీగా కురుస్తోంది. ఈ దృశ్యాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  

వాతావరణ మార్పులు, ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రపంచంలో అనేక చోట్ల విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి గల్ఫ్ లోనూ జరుగుతున్నాయి. ఇప్పుడు మంచు కూడా అక్కడ శీతల దేశాల్లోలా మారడం మాత్రం విచిత్రంగా కనిపిస్తోంది.               

ట్రంప్‌ కంటే హారిస్‌ దగ్గరే ఎక్కువ సంపద – అంత డబ్బు ఎలా సంపాదించారు?

అయితే ఇలా ఎడారుల్లో వరదలు రావడం, మంచు తుపాన్లు రావడం వాతావరణ మార్పులకు సంకేతమని ఇది భూమి మనుగడకు ప్రమాదకర సంకేతాలని నిపుణులు అంటున్నారు. ఎడారుల్లో వరదలు, మంచు వస్తే.. ఇప్పటి వరకూ మంచు ప్రాంతాలుగా ఉన్న అంటార్కిటికా వంటివి మంచు కరిగిపోయి ఎడారులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. పర్యావరణ విధ్వంసం వల్లే ఇలాంటివి జరుగుతూంటాయని.. వీటి వల్ల వచ్చే పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని అంటున్నారు . అందుకే ప్రపంచం ఇలాంటి వాటిని విచిత్రాలుగా కాకుండా..  ప్రమాదకర సంకేతాలుగా చూడాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.     

మరిన్ని చూడండి

Source link