Bholaa Shankar Censor Report భోళా శంకర్ సెన్సార్ రిపోర్ట్.. 4 ఛేంజెస్!


Sat 05th Aug 2023 07:49 AM

bholaa shankar,censor report,censor cuts,chiranjeevi,megastar  భోళా శంకర్ సెన్సార్ రిపోర్ట్.. 4 ఛేంజెస్!


Bholaa Shankar Censor Report భోళా శంకర్ సెన్సార్ రిపోర్ట్.. 4 ఛేంజెస్!

సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. మరోసారి వింటేజ్ మాస్ అవతార్‌తో విధ్వంసం సృష్టించడానికి భోళా శంకర్‌గా బరిలోకి దిగుతున్నారు. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి దిగబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరో వాల్తేరు వీరయ్య వంటి హిట్ మెగాస్టార్‌కి రాబోతున్నట్లుగా సెన్సార్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

ఈ సినిమాకు సెన్సార్ చేసిన సభ్యులు.. యుబైఏ సర్టిఫికేట్‌తో పాటు నాలుగు కరెక్షన్స్‌ను సూచించారు. ఆ నాలుగు కరెక్షన్స్ మినహా.. సినిమా అంతా చిరు శివతాండవమే అనేలా వచ్చిన సెన్సార్ టాక్‌తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తోనే.. సినిమాపై పాజిటివ్ బజ్ వచ్చేసింది. అయితే కాంపిటేషన్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఉండటంతో మెగా ఫ్యాన్స్ కూడా కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ ఇప్పుడొచ్చిన సెన్సార్ రిపోర్ట్‌తో మెగాస్టార్ మరోసారి బాక్సాఫీస్‌ని షేకాడివ్వబోతున్నాడనేది అర్థమవుతోంది. 

సెన్సార్ కరెక్షన్స్ విషయానికి వస్తే.. 1. స్టార్టింగ్‌లో వచ్చే మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే సూచనతో కూడిన అక్షరాలను పెద్ద సైజులో ప్రదర్శించాలి. 2. సినిమాలో డ్రగ్స్‌కు సంబంధించిన కంటెంట్ ఉండటంతో.. డ్రగ్స్ వాడకంపై కూడా సినిమా స్టార్టింగ్‌లోనే సూచన చేయాలి. 3. వాల్తేరు వీరయ్య తరహాలో.. ఇంటర్వెల్‌లో విలన్ తల నరికే సన్నివేశాల విజిబిలిటీని 50 శాతం వరకు తగ్గించాలి. 4. ఇక నాల్గవది.. బద్దలు బాసింగాల్ అనే పదం డబ్బింగ్ నుంచి తొలగించడమే కాకుండా.. సబ్ టైటిల్స్ కూడా ప్రదర్శించకూడదు. ఈ నాలుగే సెన్సార్ సభ్యులు చెప్పిన కరెక్షన్స్. మొత్తంగా అయితే సెన్సార్ టాక్ చాలా పాజిటివ్‌గా ఉందని తెలుస్తోంది.


Bholaa Shankar Censor Report :

Bholaa Shankar Censor Cuts and Report





Source link