Bengaluru Man Tells High Court 27 Kgs Ganja Might Have Grown Naturally In His Backyard | Bengaluru: పెరట్లో గంజాయి తోట – దానికంతటికి అదే పెరిగిందన్న ఇంటి యజమాని

Ganja Might Have Grown Naturally :  బెంగళూరులో ఓ వ్యక్తిని గంజాయి పెంచుతున్నారని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి జయానగర్లో సొంత ఇంట్లో నివాసం ఉంటారు. అతని ఇంట్లో పెరట్లో స్వయంగా పెంచుతున్నారు. సమాచారం అందడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి ఏకంగా 27కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే తాను తప్పేం చేయలేదని ఆయన వాదించడం ప్రారంభించారు. మరి ఆ గంజాయి ఎక్కడిది అంటే.. తాను పట్టించుకోలేదని దానంతటకు అవి పెరిగాయని ఆయన వాదించారు. తనకంటే తెలివి గలవాడు ఉండరన్నట్లుగా ఆయన చేసిన వాదన విని పోలీసులు కూడా ఫక్కున నవ్వారు. 

అడ్డంగా దొరికి  హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన గంజాయి సాగుదారుడు           

ఈ వ్యక్తి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే పోలీసులు తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాలని తానే హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణలో అదే వాదన వినిపించారు. అక్కడ గంజాయి మొక్కలు ఎలా పెరిగాయో తెలియదని గతంలో ఎవరో పెంచి ఉంటారని.. వాటి వల్ల ఇప్పుడు పెరిగి ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే గంజాయి మొక్కలు జయానగర్ లాంటి కాంక్రీట్ జంగిల్ గా మారిన కాలనీలో దానంతటకు అవి ఎలా పెరుగుతాయని హైకోర్టు జడ్జికి అనుమానం వచ్చింది. ఆ అనుమానానికి నిందితుడి వద్ద సమాధానం లేదు.      

Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి – స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్

దానంటికి అదే పెరిగిందని నిరూపించాలన్న హైకోర్టు                                              

ఈ వ్యక్తి లాయర్ మరింత తెలివిగా వాదించారు. ఆయన ఏమంటారంటే.. కేసు గంజాయిని సాగు చేయడమేనని.. దాన్ని వాడటం కాదన్నారు. అలాగే అమ్మడం కూడా కాదన్నారు. ఈ వాదనపై న్యాయమూర్తి సూటిగా ప్రశ్నించారు.  వాడకానికి అమ్మకానికి కాకపోతే మరి ఓ ప్యాషన్ గా గంజాయి పెంచుతున్నారా అని ప్రశ్నించారు ఈ కేసులో సాక్ష్యాలు లేకపోతే తాము కేసును క్వాష్ చేస్తామని కానీ అసులు ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు వాటంతటికి అవే ఎలా పెరిగాయో నిరూపించాలన్నారు.తదుపరి విచారణ డిసెంబర్ నాలుగో తేదీకి వాయిదా వేశారు. 

Also Read: అమెరికాపై అణుబాంబులేయడానికి పుతిన్ రెడీ – కొత్త ఫైల్‌పై సంతకం – బైడెనే కారణం !

అదే విధంగా పూలకుండీల్లో గంజాయి పెంచుతూ దొరికిపోయిన జంట            

ఈ కేసులో విచారణ హైలెట్ కావడానికి మరో కారణం ఉంది. బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ జంట బాల్కనీలో గంజాయి పెంచుతూ వాటి మధ్య ఫోటో షూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టడంతో అరెస్టు చేశారు. ఇప్పుడు మరో వ్యక్తి తన ఇంటి పెరట్లోనే పెంచడం.. అవి ఎలా పెరిగాయో తనకు తెలియదని వాదించడం వైరల్ గా మారింది. 

 

మరిన్ని చూడండి

Source link