మళ్లీ బీఆర్ఎస్ లోకి అరూరి రమేష్?- యూటర్న్ తీసుకోబోతున్నారంటూ జోరుగా చర్చ-wardhannapet ex mla aroori ramesh again going to brs talk in constituency ,తెలంగాణ న్యూస్

పార్టీ కార్యక్రమాలకు దూరం!

లోక్ సభ ఎన్నికల తర్వాత అరూరి కొంతకాలం పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉంటున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ హై కమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అక్కడ పని చేసిన ఆయన.. జిల్లాలో మాత్రం బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది. పార్టీ కార్యక్రమాల గురించి ఆయనకు సమాచారం ఇచ్చినా అంటిముట్టనట్టే ఉంటున్నట్టు పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. వివిధ సందర్భాల్లో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మారెడ్డి, గంట రవి నిర్వహించిన కార్యక్రమాలు, మీడియా సమావేశాలకు సమాచారం ఇచ్చినా ఆయన సరిగా స్పందించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అరూరికి సమాచారం ఇచ్చినా ఆయన మాత్రం ఏ కార్యక్రమానికి హాజరవడం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతుండటం గమనార్హం.

Source link