ByGanesh
Wed 27th Nov 2024 05:11 PM
హీరో సిద్దార్థ్-హీరోయిన్ అదితి హైదరి లు సీక్రెట్ గా ప్రేమించుకోవడమే కాదు.. అంతే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తెలంగాణ లోని వనపర్తి టెంపుల్ లో వీరి నిశ్సితార్ధం సింపుల్ గా జరగగా.. ఈ మధ్యనే పెళ్లి వేడుకను కూడా అదే గుడిలో చేసుకుంది ఈ జంట. పెళ్లి తర్వాత సింపుల్ గా ఉన్న ఫోటొస్ పోస్ట్ చేసిన సిద్దు, అదితి లు అప్పట్లో తమ పెళ్లి ఫొటోస్ ని పొదుపుగా షేర్ చేసారు.
తాజాగా సిద్దార్థ్-అదితిల రాయల్ వెడ్డింగ్ లుక్ బయటికి రాగా.. అందులో సిద్దార్థ్ యువరాజు గెటప్ లోను, అదితి రావు యువరాణి మాదిరి వేసుకున్న సబ్యసాచి స్పెషల్ డిజైనర్ కాస్ట్యూమ్స్ వైరల్ అయ్యాయి. రెడ్ కలర్ వెడ్డింగ్ సరీలో అదితి రావు, సిద్దార్థ్ వైట్ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ లో రాయల్ లుక్ లో కనిపించారు.
ప్రస్తుతం సిద్దార్థ్-అదితిల రాయల్ వెడ్డింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Aditi-Siddharth royal wedding is all about love:
Aditi Rao Hydari and Siddharth dreamy Sabyasachi wedding look