తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో-చిక్కుల్లో ప్రియాంక జైన్ జంట-tirumala footpath way priyanka jain couple prank video on leopard attack ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

క్రిమినల్ కేసు నమోదు చేయాలి -భాను ప్రకాష్ రెడ్డి

ఈ వివాదంపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. రీల్స్ చేయడానికి ఒక హద్దు ఉంటుందన్నారు. అసలు మనిషి అనేవాళ్లు ఇలాంటి పనులు చేయరన్నారు. సెలబ్రిటీలు అయ్యి ఉండి, ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. నిత్యం వేలాదిమంది భక్తులు వెళ్లే పవిత్రమైన నడకదారిలో పిచ్చి పిచ్చి రీల్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వీరిపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతానన్నారు. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తిరుమల ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రమని, ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని నిర్ణయించామన్నారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, అంబటి రాంబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరుతామన్నారు.

Source link