Crazy update on Jailer 2 జైలర్ 2 పై క్రేజీ అప్ డేట్


Thu 28th Nov 2024 09:56 PM

jailer 2   జైలర్ 2 పై క్రేజీ అప్ డేట్


Crazy update on Jailer 2 జైలర్ 2 పై క్రేజీ అప్ డేట్

వరస ప్లాప్ లతో నిరాశలో కూరుకుపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్ కి నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. జైలర్ విడుదలైన రోజు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా ఆ చిత్రం విడుదలైన ప్రతి భాషలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. దానితో సూపర్ స్టార్ మర్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జైలర్ కి ముందు, జైలర్ తర్వాత అన్నట్టుగా సూపర్ స్టార్ మార్కెట్ పెరిగింది. 

అయితే రీసెంట్ గా వేట్టయ్యన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రజినీకాంత్ తమిళ భాషలో హిట్ కొట్టినప్పటికీ మిగతా భాషా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసారు. ఇప్పడు లోకేష్ కనగరాజ్ తో చెయ్యబోయే కూలి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 అప్ డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. 

జైలర్ 2 స్క్రిప్ట్ ఇప్పటికే నెల్సన్ పూర్తి చెయ్యగా.. డిసెంబర్ మొదటి వారంలో రజినీకాంత్ పై ఓ వీడియో షూట్ చేసి దానిని డిసెంబర్ 12 న అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యబోతున్నారట, ఇదే పెద్ద న్యూస్ అయితే.. అసలు జైలర్ 2 లో నెల్సన్ ఏం చూపించబోతున్నాడనే క్యూరియాసిటిలో మూవీ లవర్స్ ఉన్నారు. అనౌన్స్ మెంట్ రాకుండానే జైలర్ 2 ఈ రేంజ్ క్రేజ్ రావడం మాత్రం మాములు విషయం కాదు. 


Crazy update on Jailer 2:

Jailer 2 update





Source link