Rashmika Mandanna changed her style స్టయిల్ మార్చిన రష్మిక మందన్న


Fri 29th Nov 2024 07:31 PM

rashmika mandanna  స్టయిల్ మార్చిన రష్మిక మందన్న


Rashmika Mandanna changed her style స్టయిల్ మార్చిన రష్మిక మందన్న

నిన్నటివరకు రష్మిక మందన్న ఎయిర్ పోర్ట్ లో మోడ్రెన్ గా కనిపించినా.. పుష్ప ద రూల్ ఈవెంట్స్ లో మాత్రం చక్కటి చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది. సౌత్ ఈవెంట్స్ అంటే పాట్నా, చెన్నై, కోచి ఈవెంట్స్ లో రష్మిక మందన్న స్లీవ్ లెస్ జాకెట్ లో సింపుల్ సారీస్ లోనే అద్దరగొట్టేసింది. 

నిన్నటివరకు అలా ట్రెడిషనల్ గా చీరల్లో కనిపించిన రష్మిక మందన్న ఈరోజు ముంబై పుష్ప ఈవెంట్ లో మాత్రం స్టయిల్ మొత్తం మార్చేసింది. ఆమె ముంబై వెళ్లి హిందీ మూవీస్ లో నటించడం స్టార్ట్ చేసాక అందాలు ఎంతెలా చూపించాలో అంతలా చూపిస్తూ గ్లామర్ పరంగా హైలెట్ అవుతూనే ఉంది. 

శారీ లో అయినా, మోడ్రెన్ డ్రెస్ అయినా అందాలు చూపించేందుకు తెగ తాపత్రయ పడిపోయే రష్మిక తాజాగా ముంబై పుష్ప2 ఈవెంట్ లో బ్లాక్ శారీలో అందాలు చూపించేందుకు అస్సలు వెనుకాడలేదు. బ్లాక్ చీరలో రష్మిక అందాల విందు మాములుగా లేదు. అల్లు అర్జున్ తో స్టేజ్ పై వేసిన స్టెప్స్ ఆమె అందాలను మరింతగా హైలెట్ అయ్యేలా చేసింది. 


Rashmika Mandanna changed her style:

Rashmika Mandanna raises the sari glam factor in Mumbai event 





Source link