పుష్ప-2 కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- బెనిఫిట్ షోలకు రూ.800, టికెట్ ధరలు భారీగా పెంపునకు గ్రీన్ సిగ్నల్-telangana govt super good news to allu arjun pushpa 2 agreed to hike movie tickets ,తెలంగాణ న్యూస్

Pushpa-2 Ticket Rates Hike : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా టికెట్ ధరలు భారీగా పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 ది రూల్ విడుదల కానుంది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షోల టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. బెనిఫిట్ షోల టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లో రూ.800లుగా ఖరారు చేసింది.

Source link