ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైనే-acb raids continues irrigation aee nikesh kumar belongs 30 places 150 crore disproportionate assets ,తెలంగాణ న్యూస్

రూ.లక్ష లంచం తీసుకుంటూ

నిఖేశ్ కుమార్‌ను ఈ ఏడాది మేలో ఒక ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి అనే ఫిర్యాదుదారుడి నుంచి ఏఈఈ నిఖేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె. భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజినీర్ కె. కార్తీక్ , సర్వేయర్ పి. గణేష్ సర్వేయర్ తో కలిసి రూ. 1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మణికొండలోని నెక్నాంపూర్‌లో ఓ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు, ఫార్వార్డ్ చేయడానికి అధికారులు రూ. 2,50,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో అప్పటికే రూ.1,50,000 అడ్వాన్స్‌గా చెల్లించగా, మిగిలిన రూ.1,00,000 అందజేస్తున్న సమయంలో ఏసీబీ దాడి చేసింది. సర్వేయర్ గణేష్ సర్వే చేయడానికి రూ. 40,000 డిమాండ్ చేసి లంచం తీసుకున్నాడు.

Source link