Mulugu Encounter : ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.  గ్రేహౌండ్స్ బలగాలు , మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందినట్లు తెలిసింది. ఇందులో మావోయిస్టు దళ కమాండర్ ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Source link