Inter Caste Marriages: ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రెండ్ మొదలైంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందిన కొన్ని కులాలు తీవ్రమైన ఆడపిల్లల కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో సొంత కులంలో మగపిల్లలకు పెళ్లి కావడం కష్టమైపోతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే సమస్య నెలకొంది.