ByGanesh
Wed 18th Dec 2024 11:33 AM
చందు మొండేటి ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడతారని అక్కినేని అభిమానులే కాదు మూవీస్ లవర్స్ అంతా ఫిక్స్ అయ్యేలా తండేల్ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే తండేల్ నుంచి నాగ చైతన్య-సాయి పల్లవిల బుజ్జి తల్లి సాంగ్ ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూసాం. తండేల్ లోని చైతు-సాయి పల్లవుల కెమిస్ట్రీ కి అందరూ పడిపోతున్నారు.
ఇప్పుడు శివ శక్తి పూర్తి పాట ఈ నెల 22 న రాబోతున్నట్టుగా మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో పాటుగా నాగ చైతన్య-సాయి పల్లవి ల పోస్టర్ అయితే క్రేజీగా వైరల్ అయ్యింది. శివ-పార్వతులు వలె నాగ చైతన్య-సాయి పల్లవి ల ఫోజ్ అక్కినేని అభిమానులను బాగా ఇంప్రెస్ చెయ్యగా.. సాధారణ ప్రేక్షకులు తండేల్ పోస్టర్స్ తోనే కొడుతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.
నిజంగా లవ్ స్టోరీ చిత్రం కన్నా ఎక్కువగా తండేల్ చిత్రంలో నాగ చైతన్య-సాయి పల్లవిల కెమిస్ట్రీ భలే వర్కౌట్ అయ్యింది. వాళ్ళ కెమిస్రి మాములుగా లేదు, బుజ్జి తల్లి కన్నా ఎక్కువగా శివ శక్తి సాంగ్ వైరల్ అవడం ఖాయం.
Shiva Shakti song poster from Thandel :
Shiva Shakti song from Thandel to spellbound