Bengalore Drugs Case Police have arrested a Nigerian woman: బెంగళూరులో డ్రగ్స్ ను విపరీతంగా అమ్మేది నైజీరియన్లే. సహజంగా హైదరాబాద్‌లో ఎప్పుడు డ్రగ్స్ కేసు దొరికినా నైజీరియన్లే నిందితులుగా ఉంటారు. చదువు లేదా టూరిజం వీసాలపై వచ్చి ఇక్కడే సెటిలైపోతారు. సరైన పత్రాలు లేకుండా ఉండి పోయి ఎవరికీ దొరకుకండా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు. బెంగళూరులోనూ అదే చేస్తున్నారు. అక్కడ మరింత ఎక్కువ గా ఈ బిజినెస్ లో రాటుదేలిపోయారు. ఎంతగా అంటే… స్థానికులు ఇళ్ల మధ్య పెట్టుకున్న కిరాణా కొట్టు లాంటి దాన్ని ఏర్పాటు చేసుకుని అసలు బిజినెస్ మాత్రం డ్రగ్స్ అమ్ముతోంది ఓ మహిళ.
Also Read: ఇది ఓ కొడుకు తీర్పు – లవర్‌కు ఫోన్ కొనివ్వడానికి డబ్బులివ్వలేదని తల్లి హత్య !
బెంగళూరులోని టీసీ పాళ్యం ప్రాంతంలో ఓ నైజీరియన్ మహిళ కిరాణా దుకాణం నడుపుతోంది. ఆ దుకాణంపై యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు దాడి చేయడంతో వారికి మైండ్ బ్లాంకయ్యే రీతిలో డ్రగ్స్ దొరికాయి. ఇంత బహిరంగంగా కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని మరీ ఈ పని చేస్తోందంటే.. ఇప్పటి వరకూ ఎందుకు కనిపెట్టలేకపోయామని వారు ఆశ్చర్యపోయారు. దుకాణంలో ఏకంగా పన్నెండు కేజీలు ఎల్లో , వైట్ ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. రోసెలమీ పేరుతో ఉన్న ఆ నైజిరియన్ మహిళ చాలా పెద్ద డ్రగ్ రాకెట్ నడుపుతోంది.
మొత్తం డెబ్బై సిమ్ కార్డులను ఉపయోగిస్తోంది. ఒక్కో గ్రూపు కస్టమర్లకు ఒక్కో కార్డు ఉపయోగిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ డ్రగ్ విలువ రూ. పాతిక కోట్ల వరకూ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే మొదటి సారి. న్యూ ఇయర్ వస్తూండటంతో .. పార్టీల కోసం పెద్ద ఎత్తున డ్రగ్స్ ఆర్డర్లు అందుకున్నారని.. వారికి సరఫరా చేయడానికి తెప్పిస్తున్నారని భావిస్తున్నారు.
Also Read: అమ్మాయిలు ఫోన్లు అన్‌లాక్ చేసివ్వాలి! ఫొటోలు, వీడియోలు సేకరించి వేధింపులు – ఫిర్యాదులకు బాధితులు క్యూ
అసలై నైజీరియన్లు 90 శాతం మంది వచ్చేది డ్రగ్స్ బిజినెస్ చేయడానికేనని రికార్డులు చెబుతున్నాయి. వీసా గడువు ముగిసిన వారిని కూడాడ పట్టించుకోకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. వారు రహస్యంగా ఉంటూ దేశంలోకి డ్రగ్స్ తీసుకు వచ్చి విపరీతంగా బిజినెస్ చేసుకుంటున్నారు. చివరికి ఇళ్లలో కిరాణా దుకాణం పెట్టుకుని మరీ ఎండీఎంఏ విక్రయిస్తున్నారంటే వారు ఏ స్థాయిలో పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
బెంగళూరు పోలీసులు న్యూఇయర్ వేడుకల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నందున.. నిఘా పెట్టి మరీ సోదాల నిర్వహిస్తున్నారు. ప్రదానంగా నైజీరియన్లపై దృష్టిపెట్టారు. అసలు వీరు దేశంలోకి డ్రగ్స్ ఎలా తీసుకు వస్తున్నారన్నది ఇప్పటికీ చాలా మందికి తెలియని అతి పెద్ద సీక్రెట్. దీన్ని గుర్తిస్తే డ్రగ్స్ చెలామణి అగిపోయే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి