Raja Saab is confirming this రాజా సాబ్ ఇలా కన్ ఫర్మ్ చేస్తున్నారా


Wed 18th Dec 2024 04:42 PM

prabhas  రాజా సాబ్ ఇలా కన్ ఫర్మ్ చేస్తున్నారా


Raja Saab is confirming this రాజా సాబ్ ఇలా కన్ ఫర్మ్ చేస్తున్నారా

రాజా సాబ్ ఏప్రిల్ 10 నుంచి పోస్ట్ పోన్ కాబోతుందా..  ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ చిత్రం 2025 ఏప్రిల్ 10 విడుదల అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు రాజా సాబ్ అనుకున్న సమయానికి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. 

అందుకే యంగ్ హీరోలు ధైర్యంగా రెడీ అయ్యి రిలీజ్ డేట్స్ లాక్ చేస్తున్నారు. ఇప్పటికే అనుష్క ఘాటీ ఏప్రిల్ 10 న రాజా సాబ్ రావట్లేదు అని తెలిసే తర్వాత వారానికి తన చిత్రాన్ని ఫిక్స్ చేసుకుంటే.. ఇప్పుడు రాజా సాబ్ మేకర్స్ నుంచి క్లారిటీ తీసుకున్న మరో కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ తన జాక్ మూవీని ఏప్రిల్ 10 కి ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. 

దీనిని బట్టి రాజా సాబ్ ఏప్రిల్ 10 న రావడం లేదు అని అభిమానులు ఫిక్స్ అవ్వాల్సిందే అంటున్నారు. మరి ఈ విషయమై మేకర్స్ కూడా స్పందిస్తే అభిమానుల్లో ఆ కన్ఫ్యూజన్ తగ్గుతుంది. 


Raja Saab is confirming this:

Siddu Jonnalagadda Jack Release Date Locked





Source link