Thats why Allu Arjun could not go అందుకే అల్లు అర్జున్ వెళ్లలేకపోయాడు

అల్లుఅర్జున్ కిమ్స్ హాస్పిటల్ కు రాకపోవడంపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఆస్పత్రిలో శ్రీతేజ్ ను చూశాను

శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు

శ్రీతేజ్ పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది

శ్రీతేజ్ కోలుకోడానికి మేం ఎంతైన సహాయం చేస్తాం

శ్రీతేజ్ సంపూర్ణంగా ఆరోగ్యంతో తిరిగిరావడానికి ప్రభుత్వం సహకరిస్తామనడం అభినందనీయం

చాలా మంది అభిమానులు, బంధువులు, స్నేహితులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించలేదని అడుగుతున్నారు

అల్లు అర్జున్ హాస్పిటల్ కు రాకపోడానికి కారణం ఉంది

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే హాస్పిటల్ కు అల్లు అర్జున్ వస్తానని అనుకున్నాడు

కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వద్దని వారించడంతో ఆగిపోయాడు

అదే రోజు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది

మా న్యాయవాది నిరంజన్ రెడ్డి వెళ్లొద్దు, ఎవరితో మాట్లాడవద్దని అర్జున్ కు గట్టిగా చెప్పారు

ఆ తర్వాత మేం రావడానికి అనేక నిబంధనలు అడ్డువచ్చాయి

బన్నీ బాధపడుతూ నన్ను వెళ్లి చూసి రమ్మన్నారు

నేను ప్రభుత్వ అనుమతితో బాలుడు శ్రీతేజ్ ను చూసి పరిస్థితిని అడిగితెలుసుకున్నా

Source link