ముంబయి తీరంలో మునిగిన బోట్, 20 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్స్

Boat sank off the coast of Mumbai | ముంబయి: ముంబయి తీరంలో భారీ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 85 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. వెంటనే భారత కోస్ట్ గార్డ్ రంగంలోకి దాదాపు 80 మందిని రక్షించగా, గల్లంతైన మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వెల్లడించారు.

ఒకరి మృతి, అయిదుగురి పరిస్థితి విషమం

గేట్‌వే ఆఫ్ ఇండియా (Gateway of India) సమీపంలో బోటు బోల్తా పడిన ఘటనపై ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓ ప్రకటన విడుదల చేసింది. బోటులోని సిబ్బందితో సహా మొత్తం 85 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు తాము 80 మందిని రక్షించగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. రక్షించిన వారిలో కొందర్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయిదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, ఒక వ్యక్తి మృతి చెందారని బీఎంసీ తెలిపింది. సకాలంలో స్పందించి ఇండియన్ కోస్ట్ గార్డ్ వారి ప్రాణాలు కాపాడిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎలిఫెంటా గుహలకు వెళ్తుండగా ప్రమాదం..

‘నీల్‌కమల్‌’ అనే పడవ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు భారీగా పర్యాటకులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ చిన్న పడవ పర్యాటకులు వెళ్తున్న బోట్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. భారత కోస్ట్ గార్డ్స్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఓ మృతదేహాన్ని వెలికి తీయడంతో పాటు దాదాపు 20 మంది టూరిస్టులను రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో కొన్ని పడవలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని సమాచారం. మత్స్యకారుల సహాయంతో పర్యాటకులను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

 

Also Read: Bengalore Drugs Case: నైజీరియన్లకు అలుసు ఇస్తే ఇంతే -బెంగళూరులో చిల్లర కొట్టు పెట్టి మరీ డ్రగ్స్ అమ్మకం

మరిన్ని చూడండి

Source link