Couple Viral Kiss At Kolkata Metro Station Divides The Internet Watch | Viral Kiss: కోల్‌కతా మెట్రో స్టేషన్‌లో ప్రేమజంట ముద్దు సీన్

Couple Viral Kiss At Kolkata Metro Station Divides The Internet: కోల్‌కతాలోని కాళీఘాట్ మెట్రో స్టేషన్‌ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. రాత్రి కాస్తంత పొద్దుపోయాక కాస్త రిలాక్సింగ్ గా ఉంటుంది. అలాంటి సమయంలో కొన్ని జంటలు రోజంతా  కోల్ కతాలో ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వెళ్లేందుకు మెట్రో ఎక్కేందుకు వస్తారు. అలా వచ్చిన ఓ జంట విడిపోయి మళ్లీ కలవలేమని అనుకున్నారో.. ఆ రోజుకు దూరమైతే తట్టుకోలేమనుకున్నారో కానీ గాఢంగా కౌగలించుకుని అధరచుంబనం చేసేసుకున్నారు. 

ఈ జంట వాలకం చూస్తున్న కొంత మంది అలాంటి పనేదో చేస్తారని ముందుగానే అనుకున్నారేమో కానీ సీక్రెట్ గా వీడియో తీసేశారు. అలా తీస్తే పర్వాలేదు కానీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే వారు చేసిన మంచి పనేమిటంటే.. ఆ జంట ఐడెంటిటీ కనబడకుండా చూశారు. 

ఇప్పుడీ కిస్సింగ్ వీడియో వైరల్ అయింది. అందరూ చూసి వదిలి పెట్టడం లేదు. వారు మంచి పని చేశారా.. తప్పు పని చేశారా అని జడ్జ్ చేయడం మొదలు పెట్టారు. చాలా మంది వారిద్దరూ మంచి ప్రేమికులని అలా ముద్దు పెట్టుకుంటే తప్పేమిటని అంటున్నారు.



 



 

మరికొందరు బహిరంంగా అలాంటి పనులు చేయడం సమాజానికి మంచిది కాదంటున్నారు. 



 



 
ఈ కిస్సిక్ జంట ఈ పాటికి మరెక్కడో ముద్దలాడుకుంటూ ఉంటారు.కానీ ఈ సోషల్ మీడియాలో వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. ఎదుకంటే ఆ జంట చేసింది తప్పో.. ఒప్పో ఎవరూ డిసైడ్ చేయలేరు మరి. 

 

మరిన్ని చూడండి

Source link